![]() |
![]() |

యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చేసే రచ్చ వేరే లెవెల్ లో ఉంటుంది. ఆమె చేసే ఒక్క ట్వీట్ తో రచ్చ షురూ ఐపోతుంది. తన పోస్టులతో నెటిజన్లని ఎంగేజ్ చేస్తూ వినోదం పొందుతూ ఉంటుంది. అలాంటి అనసూయ రీసెంట్ గా ఒక ట్వీట్ చేసింది. "5 రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నా. దీంతో ఎక్కువ సమయం సోషల్ మీడియాలో ఉండే అవకాశం దొరికింది. ఇక్కడ ఎన్నో విషయాలు గమనించాను. ఎదుటి వ్యక్తుల పట్ల దయ, జాలి లేకుండా వేధింపులకు గురి చేస్తున్న వాళ్ళను చూసా. కొందరిలో హుందాతనం అనేదే లేదు. మనం ఎటు వెళ్తున్నామో తెలియడం లేదు" అని ఆ ట్వీట్లో రాసుకొచ్చింది. "సినీ పరిశ్రమలో ఉన్న స్టార్స్ అంతా ఒకప్పుడు ఇబ్బందులు పడిన వారే. మూవీస్ తో విజయాలు అందుకుని ఈ స్థాయికి వచ్చారు. అందుకే వారి ప్రయాణాన్ని గౌరవించాలి. ఎదుటి వ్యక్తిని విమర్శించాలంటే ఒక రీజన్ ఉండాలంటూ" అనసూయ ట్వీట్ చేసింది.
ఇక హేటర్స్ కి సంబందించిన పోస్ట్ కూడా పెట్టేసింది. వాళ్లను రెచ్చగొట్టేలా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. ద్వేషించే వారందరికీ ఓ మెసేజ్ అంటూ "నేను చేసే పని మీకు నచ్చకపోవచ్చు, కానీ నేను చేసే ప్రతీ దాన్ని మీరు చూస్తున్నారు. ఈ లెక్కన ఇప్పటికీ మీరు నా అభిమానులే కదా" అని అందులో రాసింది. హేటర్స్ను ఉద్దేశించి పెట్టిన ఈ ఇన్ స్టా పోస్ట్పై రచ్చ మొదలైంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. "వచ్చిందండి వయ్యారి... ఎందుకు మేడం నిద్రపోతున్న సింహాలను లేపుతారు అని, రెచ్చగొట్టడం అంటే ఇదే మరి.. మేము హేటర్స్ కాదు మీమర్స్" అని కామెంట్లు పెడుతున్నారు.
![]() |
![]() |